వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిమాండ్‌ లో వాసవీ మాజీ డైరక్టర్లు!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బ్యాంకును దివాళా తీసిన వాసవీ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ మాజీ డైరక్టర్లను రిమాండ్‌ లో ఉంచారు.గురువారం తమ అదుపులోకి తీసుకొన్న సిఐడి అధికారులువీరిని శుక్రవారం మెజిస్ట్రెట్‌ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం తిరిగి వారిని రిమాండ్‌ కు తరిలించారు. అయితే, వారిని కోర్టులోహాజరుపర్చే ప్రక్రియ అంతా డ్రామాగా కొనసాగింది.

మీడియా కంటపడకుండావీరిని కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు శతథాప్రయత్నం చేశారు.వీరి పరువును కాపాడాలనే ప్రయత్నమో మరో ఏమోగానీ, పోలీసులు ఈ మాజీ డైరక్టర్ల ముఖాలను కెమెరా కన్నుకు దొరకకుండా ప్రయత్నించారు.

అయితే, కోట్ల రూపాయలు బకాయిలు పడ్డ మాజీ డైరక్టర్‌ గంజి రాజమౌళి గుప్తా మాత్రంవిలేకరులతో దర్జాగా మాట్లాడారు. బ్యాంకు నుంచిపెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడాన్ని ఆయనసమర్ధించుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X