వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రవీణ్‌ తొగాడియా అరెస్ట్‌, విడుదల

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం: విశ్వహిందూ పరిషత్‌ (విహెచ్‌పి) అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ భాయ్‌ తొగాడియాను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లోకి ప్రవేశించగానే ఆయనను సోమవారం ఉదయం అరెస్టు చేశారు.

అనంతపురంలో తలపెట్టిన హిందూ రణభేరి సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన వస్తున్నారు. కర్ణాటక నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోకి ప్రవేశించారు. తొగాడియా హిందూ, ముస్లిమ్‌లను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఆయన సభలకు అనుమతి నిరాకరించారు. దీంతో అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయనను కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X