వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహమ్మద్‌ కైఫ్‌ తో మాటామంతీ

By Staff
|
Google Oneindia TeluguNews

డర్బన్‌: కివీస్‌ తో జరిగిన మ్యాచ్‌ లో కీలక సమయంలో భారత్‌ ను గట్టెక్కించడమే కాకుండా, ప్రస్తుతం ఫీల్డింగ్‌ కెప్టెన్‌గా సమర్ధంగా భాద్యతలు నిర్వర్తిస్తోన్న యువ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ భారత్‌ ఈ సారి ప్రపంచ కప్‌ జయించగలదని భావిస్తున్నాడు. గత రెండేళ్లుగా మేం ఒక కుటుంబంలా గడుపుతున్నాం. కలిసికట్టుగా ఆడుతున్నాం. ఇప్పటివరకు చక్కటి ఫలితాలు సాధించాం. ఇలానే కలిసి ఆడితే కప్‌ మనదేనని కైఫ్‌ పీటీఐ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

ఈ ప్రపంచకప్‌ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ లో విఫలం కావడం, తదనంతరం జరిగిన పరిణామాలు తన క్రికెట్‌ జీవితంలో క్రికెట్‌ రోజులని తెలిపాడు. మా ఇంటిపై దాడి చేయడం నేను నమ్మలేకపోయాను. ఎవరైనా ఒకరింటిపై అలా ఎలా దాడిచేయగలరుఅని స్టైలిష్‌ బ్యాట్స్‌ మెన్‌ విస్మయం వ్యక్తం చేశాడు.

యువక్రికెటర్లలో యువరాజ్‌ సింగ్‌, కైఫ్‌ మిడిల్‌ ఆర్డర్‌ లో వెన్నెముకగా నిలుస్తున్నారు. గతంలో ఆరు, ఏడు స్థానాల్లో వచ్చిన కైఫ్‌ ఇటీవల నాలుగో నెంబర్‌ బ్యాట్స్‌ మెన్‌ గా వస్తున్నాడు. దీంతో కైఫ్‌ బ్యాట్‌ నుంచి పరుగులు అధికంగా వస్తున్నాయి. దీని గురించి వ్యాఖ్యానిస్తూ..దేశవాళీ క్రికెట్‌ లో నేను వన్‌ డైన్‌ లో వచ్చేవాడిని. సో..నాకు నాలుగో నెంబర్‌ కేటాయించగానే కంపర్టబుల్‌ గా ఫీలయ్యాను. కెప్టెన్‌ గంగూలీ, కోచ్‌ జాన్‌ రైట్‌ లు తీసుకున్న నిర్ణయమిదని తెలిపాడు.

ప్రస్తుత భారత జట్టుకు ఇద్దరు ఫీల్డింగ్‌ కెప్టెన్‌ లు, ఇద్దరు బౌలింగ్‌ కెప్టెన్లు, ఇద్దరు బ్యాటింగ్‌ కెప్టెన్లున్న విషయం తెలిసింది. ఫీల్డింగ్‌ కెప్టెన్‌ గా భాద్యతలు స్వీకరించడంపై కైఫ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ప్రతి మ్యాచ్‌ కు ముందు నేను, యువరాజ్‌ సింగ్‌ ఫీల్డింగ్‌ మొహరింపు గురించి చర్చిస్తాం. ఎదుటి జట్టు బ్యాట్స్‌ మెన్‌ ఆటతీరు, మైదానం వైశాల్యాన్ని బట్టి మేం ప్లాన్‌ రచిస్తాంఅని కైఫ్‌ వివరించాడు. కైఫ్‌ బ్యాటింగ్‌ తీరు, ఫీల్డింగ్‌ లో నైపుణ్యం మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ ను తలపిస్తుంటుంది. ఈ విషయాన్ని మాత్రం కైఫ్‌ కొట్టిపారేస్తున్నాడు.

అవును. చాలామంది నాతో అదేమాట అంటారు. అజార్‌ బాయినే కాదు, నేను ఎవరినీ అనుసరించాను. నా పద్దతిలోనే ఆడుతాను. అని సమాధానమిచ్చాడు. ప్రస్తుత వరల్డ్‌ కప్‌ గురించి మాట్లాడుతూ..కప్‌ మన వశం కావడానికి ఇంకా రెండు మ్యాచ్‌ ల దూరంలోనే ఉన్నాం. ఇదే ఫామ్‌ కొనసాగుతుందని భావిస్తున్నాం. మరో వారం రోజులు అన్ని మాకు అనుకూలిస్తే చాలు కల నిజమైనట్లే.నని ఆశాభావం వ్యక్తం చేశాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X