వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్‌ సిఎం మరాండీ రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

రాంచీ: జార్ఖండ్‌ ముఖ్యమంత్రి బాబూలాల్‌ మరండీ సోమవారంనాడు రాజీనామా చేశారు. శాసనసభలో బలనిరూపణ చేసుకోవాల్సిన సమయంలో తగినంత బలం లేకపోవడంతో ఆయన ముందే రాజీనామా సమర్పించారు.

స్పీకర్‌ ఇందర్‌ సింగ్‌ నామ్‌ధారి శాసనసభను సమావేశపరచడానికి ఒక గంట సమయం మాత్రమే ఉన్న పరిస్థితిలో బాబూలాల్‌ మారండి రాజీనామా చేయడం విశేషం. నామ్‌ధారి ప్రతిపక్షాల సారథ్యంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నారు. మారండి సోమవారం ఉదయం రాజభవన్‌కు వెళ్లి గవర్నర్‌కు తన రాజీనామాలేఖను అందజేశారు.

ఏడుగురు మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపాదించిన కోత తీర్మానం వీగిపోయిందని ఈ నెల 13వ తేదీన స్పీకర్‌ ప్రకటించారు. దీంతో జార్ఖండ్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం ప్రారంభమైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X