• search

ఓ కుటుంబం సజీవదహనం

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    హైదరాబాద్‌: దక్షిణమధ్య రైల్వేకు చెందిన ఓ ఉన్నతాధికారి కుటుంబాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మట్టుపెట్టారు. ఛీఫ్‌ ట్రాక్‌ ఇంజనీర్‌ బల్జేర్‌ రాజు తన భార్య, ఇద్దరు పిల్లలు సజీవదహనమయ్యారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారు ఎవరో ఖచ్చితంగా తెలియనప్పటికీ, ఫ్యాక్షనిస్ట్‌ ల పనేనని భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం బల్జేరు రాజు తన భార్య, ఇద్దరు పిల్లలతో మారుతి కారులో బయటికి బయలుదేరారు. సోమవారం ఉదయం ఆయన ఢిల్లీలో ఉంటోన్న పెద్ద కూతురు ఇంటికి ఫోన్‌ చేస్తే ఎవరూ ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో..ఆమె తన తండ్రి స్నేహితుడు సంజయ్‌ కు ఫోన్‌ చేశారు.

    ఆయన ఇంటికి వెళ్లి వాకబు చేసిన సంజయ్‌ కు తాళం వేసి కన్పించింది. ఒక రోజు అయిన రాజు సమాచారం లేకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో మంగళవారం ఉదయం మౌలాలి రైల్వే ట్రాక్‌ వద్ద ఒక కారులో సజీవదహనమైన శవాలున్నాయని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్ళారు. దహనమైన శవాలు రాజు, ఆయన కుటుంబ సభ్యులేనని పోలీసులు గుర్తించారు.

    రాయలసీమ ప్రాంతానికి చెందిన రాజును ఫ్యాక్షనిస్ట్‌ లే మట్టుపెట్టి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఘటనాస్థలాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఏమీ చెప్పలేమని, అనేక సందేహాలున్నాయని ముఖ్యమంత్రి విలేకరులకు తెలిపారు. రాజు, ఆయన భార్య ప్రభ, మూడేళ్ల కొడుకు, ఐదేళ్ళ కూతురు సజీవదహనమయ్యారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more