వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చేతులెత్తేసిన ప్రుడెన్షియల్ బ్యాంక్
హైదరాబాద్: మరో కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చేతులెత్తేసింది. ప్రుడెన్షియల్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మూత పడింది. దీంతో డిపాజిటర్లు ఆందోళనకు దిగారు.
డిపాజిటర్లకు వేయేసి రూపాయలు చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ ప్రుడిన్షియల్ బ్యాంక్‌ను ఆదేశించింది. సోమవారం నుంచి డిపాజిటర్లకు వేయేసి రూపాయలు చెల్లిస్తామని బ్యాంక్ అధికారులు చెప్పారు. ఇచ్చిన అప్పులు వసూలు కాకపోవడంతో ప్రుడెన్షియల్ బ్యాంక్ చేతులెత్తేసే పరిస్థితికి దిగజారింది. గతంలో కూడా ప్రుడెన్షియల్ బ్యాంక్ ఈ విధమైన పరిస్థితినే ఎదుర్కుంది. అయితే త్వరలోనే కోలుకుంది. తమది 87 ఏళ్ల పాత బ్యాంక్ అని, తాము ఎవరినీ మోసం చేయబోమని బ్యాంక్ అధికారులు అంటున్నారు. ఇటీవలే వాసవి కో ఆపరేటివ్ బ్యాంక్ చేతులెత్తేసిన విషయం తెలిసిందే.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!