ఇరాక్‌పై కుదరని ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ: ఇరాక్‌పై అమెరికా యుద్ధం విషయంలో ఏకాభిప్రాయం సాధించడంలో ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విఫలమయ్యారు. ఆయన శనివారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇరాక్‌పై అమెరికా సైనిక చర్యను ఖండించాలని ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తికి వాజ్‌పేయి అంగీకరించలేదు. దీంతో ఏకాభిప్రాయసాధన సాధ్యం కాలేదు.
ఇరాక్ సంక్షోభం విషయంలో ఉమ్మడి తీర్మానం చేసే విషయంలో పదాల వాడకంపై అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రి జస్వంత్ సింగ్ సమావేశానంతరం విలేరులతో చెప్పారు. దౌత్యపరమైన పదాలు కఠినంగా వుండాల్సిన అవసరం లేదని, సంయమనంతో కూడిన భాషతో సందేశాన్ని అందించవచ్చునని వాజ్‌పేయి అన్నారు. సైనిక చర్యలో న్యాయబద్దతను తాము చూడడం లేదని, యుద్ధాన్ని నివారించే అవకాశం ఉందని తమ అభిప్రాయమని వాజ్‌పేయి సమావేశంలో అన్నారు.
ఇరాక్ సంక్షోభంపై ప్రభుత్వం అందరినీ విశ్వాసంలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. తమ ఇష్టపూర్వకంగానే 19 మంది భారతీయులు బగ్దాద్‌లో ఉండిపోయారని జస్వంత్ సింగ్ చెప్‌ఆపరు. గల్ఫ్ ప్రాంతంలో భారతీయుల రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. బగ్దాద్‌లోని భారత దౌత్యకార్యాలయం భద్రంగానే ఉన్నదని ఆయన చెప్పారు.
అఖిల పక్ష సమావేశానికి సోనియా గాంధీ (కాంగ్రెస్), సోమనాథ్ ఛటర్జీ (సిపిఎం), ములాయం సింగ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ), లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్‌జెడి) హాజరయ్యారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!