వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా యుద్ధ సామగ్రి: అమెరికా

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: ఇరాక్‌కు నిషేధిత యుద్ధ సామ్రగిని రష్యాలోని కంపెనీలు అమ్ముతున్న విషయమై అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్‌ పుతిన్‌తో ప్రస్తావించారు. ఆయన పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ వర్గాలు తెలియజేశాయి.

ఈ విషయాన్ని తాను పరిశీలిస్తానని పుతిన్‌ చెప్పినట్లు వైట్‌హైస్‌ ప్రెస్‌ సెక్రటరీ అరి ఫ్లెశ్చర్‌ విలేకరులతో చెప్పారు. రష్యా ఇరాక్‌కు యుద్ధ సామగ్రిని సరఫరా చేస్తోందనే వార్తలకు బుష్‌ ఆందోళన చెందారని ఆయన చెప్పారు.

ఇటువంటి సరఫరాలేవీ లేవని ఇప్పటికే సమాచారం విడుదల చేసిందని పుతిన్‌ ప్రెస్‌ సెక్రటరీ అలెక్సీ గ్రోమోవ్‌ చెప్పారు. తన ఆరోపణలను అమెరికా నిరూపించడంలో విఫలమైందని పుతిన్‌ బుష్‌తో అన్నట్లు ఆయన తెలిపారు. ఇటువంటి ఆరోపణలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బ తీస్తాయని పుతిన్‌ అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X