వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వ్యాట్ కు అసెంబ్లీ ఆమోదముద్ర
హైదరాబాద్: ఏప్రిల్ ఒకటి నుంచి దేశమంతటా అమల్లోకి రానున్న వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)కు సంబంధించిన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. అన్ని పార్టీలు వ్యాట్ బిల్లుకు ఓకే చెప్పడంతో ఈ బిల్లుకు ఆమోదముద్ర లభించింది. బీజేపీలోనే వ్యాట్ పై భిన్నాభిప్రాయలున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఇక్కడి నేతలు ఎవరూ అడ్డుచెప్పలేదు.
మరోవైపు, వ్యాట్ పై పలు వాణిజ్య సంస్థలు అభ్యంతరాలు తెలియచేస్తూ కేంద్రంపై ఒత్తిడిపెంచుతున్నారు. మంగళవారం ఔషధ, డ్రగ్గిస్ట్ కంపెనీలు దేశవ్యాప్త బంద్ నిర్వహించగా, బుధవారం రాష్ట్రంలోని కొన్ని కంపెనీల యజామాన్యాలు ముఖ్యమంత్రికి తమ సమస్యలను విన్నవించారు. ఏప్రిల్ 1 నుంచి వ్యాట్ అమలు నిర్ణయంలో ఎటువంటి మార్పులేదని కేంద్రం స్పష్టం చేసింది.
Comments
Story first published: Wednesday, March 26, 2003, 23:53 [IST]