• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అభ్యున్నతిని, రాజకీయాలను ముడిపెట్టొద్దు

By Staff
|
హైదరాబాద్‌: రాష్ట్ర అభ్యున్నతికి, రాజకీయాలకు ముడిపెట్టొద్దని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు హితవు పలికారు. రాజకీయాల వల్ల ప్రగతి కుంటుపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగి 21 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలుగు దేశం పార్టీ పేదల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

అయితే, కాంగ్రెస్‌ వంటి పార్టీలు కాలంతో పాటు మారడం లేదని, పాత ధోరణిలోనే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. వేరే దేశాల్లో జరుగుతోన్న అభివృద్ధిని చూసి నేర్చుకోవాల్సిందిగా అన్ని పార్టీల శాసనసభ్యులను విదేశాలకు పంపిస్తే...కాంగ్రెస్‌

వారు అక్కడికి వెళ్ళి వచ్చి తాను చేస్తోన్న పనులను ఎంతో మెచ్చుకున్నారన్నారు.

రాష్ట్రప్రగతికి సహాయం చేస్తామని చెప్పారని, తీరా ఇప్పుడు అవన్నీ మర్చిపోయారని, వారి తీరే అంత అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం క్రియాశీల, సాధారణ సభ్యుల సంఖ్య 80 లక్షలకు చేరిందని చంద్రబాబు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X