• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

18న ప్రధాని కాశ్మీర్‌ పర్యటన

By Staff
|

న్యూఢిల్లీ: ఈ నెల ఏప్రిల్‌ 18 నుంచి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌ పేయి కాశ్మీర్‌ లో రెండు రోజుల పాటు పర్యటిస్తారు. కాశ్మీర్‌ కు ఆరువేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన ఏడాది తర్వాత ప్రధాని కాశ్మీర్‌ ను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తర-దక్షిణ రహదారి ప్రాజెక్ట్‌ ను ప్రధాని ప్రారంభిస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

ప్రధాని డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ చతుర్ముఖ జాతీయ రహదారిలో భాగమైన ఈ ప్రాజెక్ట్‌ కు ప్రధాని భూమి పూజ నిర్వహిస్తారని తెలిసింది. అలాగే శ్రీనగర్‌ లో ఒక బహిరంగ సభలో కూడా ప్రధాని ప్రసంగిస్తారని ఆ వర్గాలు తెలిపాయి. గత దశాబ్దన్నర కాలంలో ఇక్కడ ఏ ప్రధాని బహిరంగ సభలో ప్రసంగించలేదు. దీంతో పాటు ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు.

అయితే, మార్చి 23న పండిట్ల ఊచకోత ఘటన జరిగిన నడిమార్గ్‌ గ్రామాన్ని మాత్రం ప్రధాని సందర్శించరని ఆ వర్గాలుపేర్కొన్నాయి. ముప్తీ మహమ్మద్‌ సయిద్‌ అధ్వర్యంలోని ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోన్న ఆర్థిక ప్యాకేజీపై కూడా ప్రధాని ఇక్కడ సమీక్షిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X