• search

ఆగని వార్‌ విధ్వంసక దాడులు

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్‌: నిషిద్ధ పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు నలుగురు పోలీసులను కిడ్నాప్‌ చేశారు. కిడ్నాప్‌అయినవారిలో ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఒక అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఒక కానిస్టేబుల్‌, ఒక హోంగార్డు ఉన్నారు. కరువు దాడికి పాల్పడి రెండున్నర లక్షలవిలువైన ధాన్యాన్ని, నగదును అపహరించారు. ఒక బస్సును దగ్ధం చేశారు. ప్రకాశం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లో ఈ సంఘటనలు జరిగాయి.

    ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కాటంరాజు తిరునాళ్ల బందోబస్తులో ఉన్న పెద్దారవీడు ఎస్‌ఐపి. ఆంజనేయులు, వైర్లెస్‌ ఎఎస్‌ఐ మద్దెల సుబ్బారావు, కానిస్టేబుల్‌ సామినేని బ్రహ్మేంద్రకుమార్‌ అలియాస్‌ బ్రహ్మయ్య, హోంగార్డు దేవరపల్లి బాబూరావులను బుధవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో నక్సలైట్లు కిడ్నాప్‌ చేశారు. దాదాపు 30 మందిపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు ఈ కిడ్నాప్‌లో పాల్గొన్నారు.

    ఇదిలా వుంటే, నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని ఆజ్మాపూర్‌లో మంగళవారం రాత్రి 30 మందిపీపుల్స్‌వార్‌ సభ్యులు, 60 మంది సానుభూతిపరులు కరువు దాడికి పాల్పడ్డారు. హనుమాన్‌ బిన్నీరైస్‌మిల్లులోని 150 బస్తాల వరి ధాన్యాన్ని, మారం సత్యనారాయణ ఇంటిని లూటీ చేశారు.

    వరంగల్‌ జిల్లా వెంకటాపురం మండలం గుర్రంపేటలో మంగళవారం రాత్రి ఆర్టీసి బస్సును దగ్ధం చేశారు. వార్‌ అగ్రనేత రామకృష్ణ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా వారు ఈ సంఘటనకు పాల్పడ్డారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more