వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేమ్స్‌ బాండ్‌ చిత్రంలో ఐశ్వర్యారాయ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబై: జేమ్స్‌ బాండ్‌ చిత్రాల్లో నటించే వారికెవరికైనా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. హాలీవుడ్‌ లో ప్రతిష్టాత్మక చిత్రంగా భావించే జేమ్స్‌ బాండ్‌ ప్రాజెక్ట్‌ లలో అవకాశం హీరోయిన్‌ లు పోటీపడుతుంటారు. కానీ భారతీయ నటి ఐశ్వర్యారయ్‌ ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. లండన్‌ కు చెందిన క్యాస్టింగ్‌ ఏజెన్సీ ఇటీవల ఐశ్వర్యారాయ్‌ తో చర్చలు జరిపేందుకు ముంబై వచ్చింది.

అయితే, ఆమె ప్రస్తుతం యాక్సిడెంట్‌ కారణంగా ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో ఈ ఆఫర్‌ పై చర్చలు నిలిచిపోయాయి. పియర్స్‌ బ్రాస్నన్‌ జేమ్స్‌ బాండ్‌ గా నటించనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. గత సినిమాలో హాలెబెర్రీ హీరోయిన్‌ గా నటించగా, ఈ ఏడాది ఐశ్వర్యారాయ్‌ కు అవకాశం వచ్చింది. సోమవారం ఈ సంస్థ ప్రతినిధులు ఆసుపత్రిలోనే ఆమెతో చర్చలు జరపనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X