వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పసిపాప మృతితో వరంగల్‌లో ఉద్రిక్తత

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: పసిపాప మృతికికారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌లో ఆ పాప కుటుంబ సభ్యులు, మహిళాసంఘాలు,స్వచ్ఛంద సంస్థలు ఆందోళనకు దిగాయి. దీంతో శుక్రవారం వరంగల్‌లో ఉద్రిక్తత నెలకొంది.

సికెఎం ఆస్పత్రిలో సుజాత అనే మహిళ ఈ నెల 9వ తేదీ రాత్రి ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ పాప మరణించిందని చెప్పి వైద్యులు ఆ పాపను బట్టలో చుట్టిపంపారు. బట్టల్లో చుట్టిన పాపను తీసుకుని సుజాత ఇంటికి వెళ్లిపోయింది. తెల్లారి ఏడుపువినిపించి పాప బతికే ఉన్నదని గమనించిన తల్లి సుజాత, ఆమె బంధువులు మళ్లీ సికెం ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు ఆ పాపను చూడకుండా ఎంజిఎం ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు. ఎంజిఎం ఆస్పత్రికి వెళ్లేసరికి ఆ పాపమరణించింది. దీంతో ఆగ్రహించిన సుజాత కుటుంబసభ్యులు, మహిళా సంఘాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాప మరణానికికారకులైన వైద్యులను సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X