వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రభుత్వంపై వైయస్సార్ ధ్వజం
సంగారెడ్డి: నీటిపారుదల, మార్కెటింగ్ రంగాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లనే గ్రామీణ వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డివిమర్శించారు. ఆయన శుక్రవారం మూడో రోజు తన పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పర్యటించారు. పలు చోట్ల ప్రసంగించారు.
రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం నాయకుల, కార్యకర్తల జేబులు నింపేందుకే ఉపయోగపడుతున్నాయని ఆయనవిమర్శించారు. తెలుగుదేశం కార్యకర్తలను రక్షించే పనినే ప్రభుత్వం ప్రధానంగాపెట్టుకుందని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకునైనా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!