• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరువుపై క్యాబినెట్‌ సమావేశం

By Staff
|

హైదరాబాద్‌: కరువు సహాయక చర్యలసమీక్ష, త్రాగునీటి సరాఫరా పరిస్థితిని సమీక్షించడంతో పాటు పలుఅంశాలపై ప్రత్యేక చర్చ జరిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో క్యాబినెట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ప్రారంభమైన ఈ సమావేశం ఇంకా కొనసాగుతోంది.

ముగిసిన జలచైతన్యం కార్యక్రమంపై ప్రజల నుంచి వచ్చిన స్పందన, లారీల సమ్మె నేపథ్యంలో నిత్యావసరసరుకుల పంపిణీపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వంటివిషయాలను చర్చకు వచ్చాయి.

ప్రతిపక్షనేత వై.ఎస్‌ పాదయాత్రలకు వస్తోన్నవిశేష స్పందన నేపథ్యంలో ప్రభుత్వ పరంగా దీన్ని ఎదుర్కొనేఅంశాన్ని కూడా ఇందులో చర్చించే అవకాశం ఉంది. కరువుపైనే ప్రధానంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కరువుపై ఏమీ చేయడం లేదని ప్రజల్లో భావన రానీయకుండా చేయాలని ముఖ్యమంత్రి పట్టుదలగా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X