వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్ఘర్‌ అలీపై పక్కా ఆధారాలు: సిబిఐ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ హైదరాబాద్‌/నల్లగొండ: గుజరాత్‌ మాజీ హోం మంత్రి హరేన్‌ పాండ్యాను హత్య చేసిందిఅస్ఘర్‌ అలీయేనని చెప్పడానికి తగిన ఆధారాలున్నాయని కేంద్ర దర్యాప్తు బృందం(సిబిఐ) ప్రకటించింది. హరేన్‌ పాండ్యా హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురిని గురువారంనాడుఅరెస్టు చేశారు. హరేన్‌ పాండ్యాను కాల్చి చంపిందిఅస్ఘర్‌ అలీయేనని నమ్మకంగా చెప్పగలమని సిబిఐ డైరెక్టర్‌పి.సి. శర్మ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో అన్నారు.అస్ఘర్‌ అలీ పాకిస్థాన్‌లో శిక్షణ పొంది వచ్చినట్లు కూడా ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. హరేన్‌ పాండ్యా హత్యలో ఎనమండుగురు పాల్గొన్నారని ఆయన అన్నారు.

ఇదిలా వుంటే, హరేన్‌ పాండ్యా హత్య కేసులో ప్రమేయం ఉన్నదని అనుమానిస్తూ హైదరాబాద్‌ పోలీసులు మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరికొందరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు జరుపుతున్నాయని పోలీసు ఉన్నతాధికారిఖాన్‌ చెప్పారు.

అస్ఘర్‌ అలీకి పలు నేరాలతో సంబంధాలున్నాయని నల్లగొండ పోలీసులంటున్నారు. ఇతను నల్లగొండలో ఒక కిరాణాషాపు నడుపుతూ లోపల ఇంటర్నెట్‌పెట్టుకుని పాకిస్థాన్‌లో ఐఎస్‌ఐతో కార్యకలాపాలు నడిపిస్తూ వచ్చాడనిఅంటున్నారు. రిజర్వ్‌ పోలీసు విభాగంలో ఎఎస్‌ఐ కొడుకు కావడం వల్లనే నల్లగొండ పోలీసులుఅస్ఘర్‌ అలీ పట్ల ఉదాసీనంగా వ్యవహరించారనేవిమర్శలున్నాయి. ఇతను ఐఎస్‌ఐతో 1996 నుంచి సంబంధాలు కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. ఈవిషయం ఆరేళ్ల క్రితమే పోలీసులకు తెలుసునని కూడాఅంటున్నారు.

హరేన్‌ పాండ్యా హత్యతో అబ్దుల్‌ బారీకి సంబంధం లేదని అతని కుటుంబ సభ్యులంటున్నారు.అస్ఘర్‌ అలీతో పాటు అరెస్టయినవారిలో నల్లగొండకే చెందిన అబ్దుల్‌ బారీ కూడా ఉన్నాడు. పాలవ్యాపారం చేసుకునే అబ్దుల్‌ బారీపై రౌడీషీట్‌ ఉంది. హరేన్‌ పాండ్యా హత్య జరిగిన కాలంలో అతను ఊరు విడిచి వెళ్లలేదని బారీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే పంచలోహవిగ్రహాల కేసులో బారీని అరెస్టు చేయడానికి ఆ కాలంలో తాము వెళ్లామని, అయితే అతను ఆ సమయంలో పరారీలో ఉన్నాడని నల్లగొండ పోలీసులుచెబుతున్నారు.

కుట్రలో భాగంగానే హరేన్‌ పాండ్యా హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారినిఅరెస్టు చేశారని ఆంధ్రప్రదేశ్‌ పౌర హక్కుల సంఘం నాయకులువిమర్శిస్తున్నారు. పాండ్యా హత్య విషయంలో ముఖ్యమంత్రి నరేంద్ర మోడిపై వస్తున్న ఆరోపణలను తప్పు దారి పట్టించడానికే ఈఅరెస్టు జరిగాయని వారు విమర్శిస్తున్నారు. అస్ఘర్‌ అలీతో పాటుఅరెస్టయిన హైదరాబాద్‌కు చెందిన రవూఫ్‌కు హరేన్‌ పాండ్యా హత్యతో సంబంధం లేదని వారన్నారు.

హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఉండే రవూఫ్‌ మజ్లీస్‌ తరఫున కార్పోరేటర్‌గా పోటీ చేశాడు. హరేన్‌ పాండ్యా హత్య జరిగిన రోజు గత నెల 26వ తేదీన రవూఫ్‌ తన తండ్రితో పాటు ఆస్పత్రికి వెళ్లాడని రవూఫ్‌ తల్లి రఖియా బేగం చెపుతోంది. తమ కొడుకు చాలా మంచివాడని, ఇక్కడ ఎవరిని అడిగినా ఆవిషయం చెబుతారని ఆమె అంటోంది. పాకిస్థాన్‌కు వెళ్లి తన కొడుకు శిక్షణపొందాడనేది పచ్చి అబద్ధమని ఆమె చెపుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X