• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నల్లగొండ కలెక్టర్‌పై చర్య: కాంగ్రెస్‌

By Staff
|

సంగారెడ్డి/హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా భువనగిరిలో రైతు రామిరెడ్డిపై చేయి చేసుకున్న కలెక్టర్‌ సిసోడియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణరావు, కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి వేర్వేరుగా ఖండించారు. ఈ సంఘటనను వారు తీవ్రంగా ఖండించారు.

తన పాదయాత్రలో భాగంగా రాజశేఖర్‌ రెడ్డి మెదక్‌ జిల్లాలోని పోతురాజుపల్లె, ఘనాపూర్‌, తదితర గ్రామాల్లో తిరిగారు. ఆత్మహత్య చేసుకున్నపేద రైతు దేవయ్య ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయనవిమర్శించారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని ఆయన చెప్పారు. రైతుపై నల్లగొండ జిల్లా కలెక్టర్‌ చేయి చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అద్దం పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

సిసోడియాకు స్వయంగా విద్యార్థులపై లాఠీఛార్జీ చేసిన చరిత్ర ఉన్నదని, ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా ఆయన ఇటువంటి పనికే ఒడిగట్టారని సత్యనారాయణ రావు చెప్పారు. రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర సాగని ఇతర 12 జిల్లాల్లో ఇతర కాంగ్రెస్‌ నాయకులు పాదయాత్రలు చేస్తారని ఆయన హైదరాబాద్‌లోవిలేకరులతో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X