వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సయీద్‌కు పూర్తి సహకారం: వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: రాష్ట్రాభివృద్ధికి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి చెప్పారు. షేర్‌-ఎ- కాశ్మీర్‌ క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీలో కూర్చున్న తామందరం జమ్మూ కాశ్మీర్‌ గురించే ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు.

కాశ్మీర్‌ నూతన సంవత్సరం నవరోజ్‌ శాంతిని, సంపదను, సోదరత్వాన్ని పెంపొందించగలదని ఆయన ఆశించారు. ప్రాణాలను ఫణంగా పెట్టి మరణానికి భయపడకుండా ఓటు హక్కును వినియోగించుకున్న కాశ్మీర్‌ ప్రజలను ఆయన అభినందించారు.

కాశ్మీర్‌లో మరణ నృత్యాలు ఆగిపోవాలని ఆయన అన్నారు. ప్రపంచమంతా వారికి వ్యతిరేకంగా ఉన్నదని సాయుధులు గుర్తించాలని ఆయన అన్నారు. పాకిస్తాన్‌తో స్నేహం చేయడానికి సిద్ధంగా వున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X