వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొనసాగుతున్న లారీల సమ్మె

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ప్రభుత్వంతో చర్చలువిఫలం కావడంతో లారీ సమ్మె శనివారం కూడా కొనసాగుతోంది. ట్రక్కర్లకు, ప్రభుత్వానికి మధ్య శనివారమో, ఆదివారమో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది.

ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కాశ్మీర్‌ పర్యటన నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈ చర్చలు జరుగతాయని సమాచారం. ట్రక్కర్ల సమ్మెకొనసాగుతుండడంతో నిత్యావసర సరుల ధరలు విపరీతంగాపెరిగిపోయాయి. ఈ స్థితిలో లారీల సమ్మెను పరిష్కరించాలని రాష్ట్రాల నుంచి కేంద్రంపై ఒత్తిడిపెరుగుతోంది. ఈ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వ్యాట్‌, తదితరఅంశాల విషయంలో ఒక మెట్టు దిగిరావచ్చునని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయితో ఈ విషయం మాట్లాడే అవకాశాలున్నాయి. సమ్మె పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాల్సిందిగా ట్రక్టర్లు ఆయనను కోరినవిషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X