వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు ప్రమాదాలకు రక్షాకవచ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి:రైలు ప్రమాదాలను నివారించడానికి చిత్తూరు జిల్లా రేణిగుంటరైల్వే స్టేషన్‌లో రక్షాకవచ్‌ను రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ప్రారంభించారు.రైలు ప్రమాదాల నివారణకు కొంకణ్‌ రైల్వే ఈ రక్షా కవచ్‌ను రూపొందించింది.

ఈ రక్షాకవచ్‌ల ఏర్పాటుకు 190 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. శాటిలైట్‌ సిగ్నల్‌ ద్వారా ఎదురెదురుగా వచ్చేరైళ్లు ఢీకొనే ప్రమాదాన్ని ఈ రక్షాకవచ్‌ తప్పిస్తుంది.రైళ్లు ఎదురెదురుగా వస్తూ ఢీకొట్టే ప్రమాదం ఉన్నప్పుడు రక్షాకవచ్‌స్టేషన్‌ మాష్టర్‌కు, గార్డుకు సిగ్నల్స్‌ అందిస్తుంది. వారు ఈ ప్రమాదాన్ని గుర్తించి నివారించలేకపోయినప్పుడు ఎదురెదురుగా వస్తున్నరైళ్లు వాటి మధ్య మూడు కిలోమీటర్ల దూరం ఉండగానే ఆగిపోతాయని ఆయన చెప్పారు. గంటకు 150 కిలోమీటర్లు వెళ్లేరైళ్లను ఈ ఏడాదే ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. ప్రతిరైలులో నాలుగు జనరల్‌ కోచ్‌లుంటాయని కూడా ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X