వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరిన్ని జైళ్ళల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దేశంలో తొలిసారిగా జైళ్ళల్లో వీడియోకాన్ఫరెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టిన మన రాష్ట్రప్రభుత్వం ఈ విధానాన్ని ఇప్పుడు మరిన్ని జైళ్ళకువిస్తరిస్తుంది. తొలుత ఈ విధానాన్ని చంచల్‌ గూడలోని పురుషుల కారాగారంలో ప్రవేశపెట్టగా, బుధవారంస్త్రీల విభాగంలోనూ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవందర్‌ గుప్తా బుధవారం చంచల్‌ గూడ మహిళా జైలులో వీడియో కాన్ఫరెన్స్‌ ను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలు నిర్భయంగా తమ బాధలను చెప్పుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. ఖైదీలు తమ గోడు మెజిస్ట్రేట్‌ నుసంకోచించకుండా, ఎటువంటి ఒత్తిడిలేని పరిస్థితుల్లోవిన్నవించుకునేందుకు వీలుగా త్రీడీ కెమెరాలను ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. త్రీడీ కెమెరా వల్ల మెజిస్ట్రెట్‌ జైల్లోని మొత్తం పరిస్థితిని పరిశీలించేవీలు ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి టి.దేవందర్‌ గౌడ్‌ కూడా పాల్గొన్నారు. మే 15 నుంచి మరో 14 జిల్లాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఆయనవిలేకరులకు తెలిపారు. తొలిదశలో చంచల్‌ గూడసెంట్రల్‌ జైల్లో ప్రవేశపెట్టగా, ఈ దశలో 25 వేల మంది ఖైదీలనువిచారించినట్లు ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X