• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాక్‌ తో దౌత్యసంబంధాలు షురూ

By Staff
|

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ తో తిరిగి దౌత్యపరమైన సంబంధాలను ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి అటల్‌బిహారీ వాజ్‌ పేయి శుక్రవారం లోక్‌ సభలో ప్రకటించారు. శాంతి ప్రక్రియకు మరింత ఊతం ఇచ్చేలా పాక్‌ లో బారత హైకమీషనర్‌ ను నియమించనున్నట్లు ప్రధాని ప్రకటించారు.

అలాగే, పౌర విమానయానాన్ని కూడా పునరుద్దరించనున్నట్లు ఆయన తెలిపారు. శాంతి దిశగా చేపట్టే చర్యల గురించి ఏప్రిల్‌ 28న పాక్‌ ప్రధాని జమాలీ చేసిన టెలిఫోన్‌ సందర్భంగా చర్చించినట్లు ప్రధాని పార్లమెంట్‌ కు తెలిపారు.

ప్రజల మధ్య రాకపోకలు,విమానయాన పునరుద్దరణ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలమీదే ప్రధానంగా తొలుత దృష్టి సారించాలని ఆయనతో చెప్పాను.అని ప్రధాని చెప్పారు. ప్రధాని ప్రకటన చేసిన కొద్ది గంటల అనంతరం పాకిస్థాన్‌ కూడా స్పందించింది. భారత్‌ తో తాము కూడా పౌరవిమాన, దౌత్య సంబంధాలను పునరుద్దస్తున్నట్లు ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X