వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆస్ట్రేలియా బృందానికి గృహ నిర్బంధం
హైదరాబాద్: సార్స్ భయంతో హైదరాబాద్ వచ్చిన విధించారు. ఇప్పటికే ఇద్దరికి సార్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరు ప్రస్తుతం హైదరబాద్లోని ఎర్రగడ్డలో గల ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో ఉన్నారు. వీరి రక్తం నమూనాలను పరీక్షల కోసం పంపించారు.
ఆస్ట్రేలియాకు చెందిన 89 మంది హైదరాబాద్ వచ్చారు. వీరందరూ వై.యం.సి.ఎ. హాస్టల్లో దిగారు. ఇందులో 22 మందిని సార్స్ భయంతో హాస్టల్ దాటి రావద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ 89 మందిని వైద్యులు పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న ఇద్దరికి పరీక్షలన్నీ నిర్వహించారు. అయితే సార్స్ వ్యాధి లక్షణాలలో ఒకటైన న్యుమోనియా వ్యాధి వీరికి లేదని, అందువల్ల వీరిది సార్స్ కాకపోవచ్చునని వైద్యులంటారు. వీరిద్దరికి సార్స్ ఉందని భయపడాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు.
Comments
Story first published: Sunday, May 4, 2003, 23:53 [IST]