వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోడెల ఆకస్మిక తనిఖీ, ముందే లీక్!
అనంతపురం: అనంతపురం ప్రభుత్వ ఆసుప్రతిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అయితే, మంత్రి పర్యటన సమాచారం అధికారులకు రెండు రోజల క్రితమే అందింది. దీంతో వారు కోడెల రాకకు ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. ఆకస్మిక తనిఖీకి వచ్చిన మంత్రిగారికి నీట్ గా వేసిన బెడ్ లు, అంతటా శుభ్రంగా ఉన్న వార్డ్ లు దర్శనమిచ్చాయి. కోడెల బెడ్ లపై వేసి ఉన్న దుప్పట్లు తీసి పరిశీలించారు. లోన చిరిగిపోయిన బెడ్ లను చూసి ఆయన ఆసుపత్రి సిబ్బిందిపై మండిపడ్డారు.
ఆసుప్రతిలో సౌకర్యాలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. వారు కూడా ఆసుపత్రి సిబ్బంది ముందే ఇచ్చిన తర్ఫీదుకు తగ్గట్లు జవాబులను రికార్డు వేశారు. అయితే, ఔట్ పేషెంట్లు మాత్రం వైద్యుల, ఆసుప్రతి సిబ్బింది లంచగొండితనం గురించి మంత్రికి ఫిర్యాదు చేశారు. డబ్బు లేందే ఏ పని జరగదని వివరించారు. అవినీతి సిబ్బందిపై చర్య తీసుకోవాలని ఆయన కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!