• search

మహిళా బిల్లుపై స్తంభించిన లోక్‌సభ

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    న్యూఢిల్లీ: వివాదస్పద మహిళ బిల్లును ప్రతిపాదించడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు మంగళవారం లోక్‌సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌ సభ్యులు పదే పదే వెల్‌లోకి దూసుకెళ్తూ, కాంగ్రెస్‌ సభ్యులతో ఘర్షణకు దిగడంతో రెండు గంటల పాట లోక్‌సభ వాయిదా పడింది.

    లోక్‌సభలో, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 85వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం లోక్‌సభ సమావేశం కాగానే ఎస్‌పి, ఆర్‌జెడి సభ్యులు వెల్‌లో గుమికూడారు. ప్రస్తుత రూపంలో తమకు బిల్లు ఆమోదయోగ్యం కాదని వారు స్పష్టం చేశారు. ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, ఒబిసిల మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) భాగస్వామ్య పక్షాలు శివసేన, సమతాపార్టీ, జనతాదళ్‌- యునైటెడ్‌ వారికి మద్దతు తెలిపాయి.

    ప్రతి రంగంలో తాము బలహీన వర్గాల ప్రయోజనాలకు తాము కట్టుబడి వున్నామని కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌ శివరాజ్‌ పాటిల్‌ చేసిన ప్రకటన ఒకానొక సందర్భంలో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. బిల్లుకు ఆమోదం లభించేలా చూడడంలో భారతీయ జనతాపార్టీతో చేతులు కలిపి కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఎస్‌పి, ఆర్‌జెడి విమర్శించాయి. శివరాజ్‌ పాటిల్‌ వ్యాఖ్యకు నిరసన తెలియజేస్తూ ఎస్‌పి, ఆర్‌జెడి సభ్యులు కాంగ్రెస్‌ సభ్యుల వైపు కదిలి పాటిల్‌తో వాదనకు దిగారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more