వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రుణప్రణాళిక విడుదల చేసిన సీఎం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రుణాల రీషెడ్యుళ్ళపై అన్ని బ్యాంకుల మధ్య విభేదాలను పరిష్కరించి ఏకీకృత విధానానికి ప్రయత్నింస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల ఏర్పాటు చేసిన సమావేశంలో 2003-2004 సంవత్సరానికి రాష్ట్ర రుణ ప్రణాళికను ఆయన విడుదల చేశారు. వ్యవసాయ రుణాల పునర్వ్యస్థీకరణ ఈ ఖరీప్‌ సీజన్‌ లోపే జరగేలా చూడాలని ఆయన సూచించారు. ఈ ఏడాది మొత్తం 11వేల కోట్ల రూపాయల రుణాలను విడుదల చేయనున్నారు.

అందులో ముఖ్యంగా వ్యవసాయరంగానికే అధికంగా ప్రాధాన్యం ఇచ్చారు. పాడి, కోళ్ళ పరిశ్రమకు రుణాలపై అధికంగా దృష్టిసారించాలని ఆయన బ్యాంకర్లను ఆదేశించారు. అయితే, తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ విధించిన నిబంధనలు రుణాల రీషెడ్యుల్‌ కు అడ్డంకిగా మారాయని బ్యాంకర్లు ముఖ్యమంత్రికి తెలిపారు. దాన్ని తాను పరిశీలిస్తానని చెప్పారు.

ఆయా బ్యాంకుల తమ నెలవారీ రుణాల ప్లాన్‌ ను తయారుచేసి తనకు అందిస్తే..సవరణలు, సూచనలు చేయగలనని ముఖ్యమంత్రి బ్యాంక్‌ అధికారులతో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X