• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దర్శకుడు కె.క్రాంతికుమార్‌ మృతి

By Staff
|
హైదరాబాద్‌: కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న తెలుగు దర్శకుడు, నిర్మాత కె.క్రాంతికుమార్‌ శుక్రవారం ఉదయం మరణించారు. నెల రోజుల క్రితం కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌ లోని ఆసుపత్రిలో చేరారు. కాస్తా కోలుకున్న తర్వాత కొద్ది రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు స్వగృహంలో నిద్రలోనే ప్రాణాలు విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయనకు 62 సంవత్సరాలు. శనివారం నాడు ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు చెప్పారు.

దాదాపు 50 చిత్రాలకు పైగా దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు వహించిన క్రాంతికుమార్‌ తెలుగులో ఆల్‌ టైమ్‌ హిట్‌ అని చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటైన సీతారామయ్యగారి మనవరాలు చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు తొలి చిత్రం స్వాతి. నిర్మాతగా శారద అనే చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టారు. ఎన్టీఆర్‌ తో సర్దార్‌ పాపారాయుడు వంటి విజయవంతమైన చిత్రాలు కూడా నిర్మించారు.

ఇంకా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించినప్పటికీ, ఇటీవల కాలంలో ఆయన రూపొందించిన 9 నెలలు వంటి ప్రయోగాత్మక చిత్రం విజయవంతం కాలేదు. స్త్రీల దృక్కోణంలో చిత్రాలు రూపొందించే దర్శకుడిగా ఆయనకు పేరుంది.

ఆయన మరణ వార్త తెలియగానే సినిమారంగానికి చెందిన ప్రముఖులంతా ఆయన స్వగృహానికి విచ్చేసి, భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

  • చిరంజీవికి గాడ్‌ ఫాదర్‌

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X