• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తుఫాన్‌..నిజంగా వచ్చేనా?

By Staff
|

చెన్నై, విశాఖపట్నం: కరువుతో అల్లాడుతోన్న రాష్ట్ర ప్రజలు భారీ తుఫాన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడు రోజులు నుంచి భారీ తుఫాన్‌ రానుందనివిశాఖ పట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం హెచ్చరిస్తున్నప్పటికీ మంగళవారం సాయంత్రం నాటికి కూడా ఇది తీరం దాటే అవకాశాలుస్వల్పంగానే కన్పిస్తున్నాయి.

ఇప్పటికీ వాయుగుండం చెన్నైకి ఆరువందల కిలోమీటర్ల దూరంలోనే కేంద్రకృతమైంది. అయితే, చెన్నై, నెల్లూరు తదితర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి తీవ్రంగా గాలులువీస్తున్నాయి. ఈ రాత్రికి మచిలీపట్నం వద్ద తీరం దాటుతుందనివిశాఖపట్నం పరిశోధనా కేంద్రం డైరక్టర్‌ జె.వి.ఎం.నాయుడు చెప్పారు. అయితే, తన ధోరణిలోనే వాతావరణంవిషయంలో ఏదీ కచ్చితంగా చెప్పలేమని కూడా అన్నారు.అసలు, తుఫాన్‌ ఆంధ్రాలో తీరం దాటకుండా...ఇంకా పైకి వెళ్ళే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఈ వాయుగుండం స్థిరంగా ఉంది. దాని కదలికల్లోపెద్దగా మార్పు కన్పించడం లేదని చెన్నై వాతావరణపరిశోధనా కేంద్రం మంగళవారం ఉదయం తన ప్రకటనల్లోపేర్కొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X