వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చొరబాట్లు తగ్గాయి: ఫెర్నాండెజ్
బెంగుళూర్: పాకిస్థాన్ సరిహద్దు నుంచి కాశ్మీర్లోకి ప్రస్తుతం చొరబాట్లు తగ్గినట్లు అనిపిస్తోందని రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ అన్నారు.
చొరబాట్లు ఒక్కోసారి ఎక్కువగానూ, ఒక్కోసారి తక్కువగానూ ఉంటాయని తాను చెబుతూ వస్తున్నానని, ఇప్పుడు తగ్గినట్లు అనిపిస్తున్నాయి, రేపు అలా వుండకపోవచ్చునని ఆయన మంగళవారంవిలేకరులతో అన్నారు.
కొత్తగా ప్రారంభమైన చర్చల ప్రస్తావన పాకిస్థాన్తోవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశలో నడిచిందని, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కాల పరిమితి ఏమీ లేదని ఆయన అన్నారు. మార్గం మాత్రం వేశామని,అందుకు సమయం పడుతుందని, దీనికి సమయాన్ని ఎవరూ నిర్ధారించలేరని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, May 13, 2003, 23:53 [IST]