వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్బన్‌ బ్యాంక్‌ లపై ప్రత్యేకచట్టం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోనిఅర్బన్‌ బ్యాంకుల్లో వెలుగుచూస్తోన్న అక్రమాల నేపథ్యంలోవీటిని కట్టడిలో ఉంచేందుకు త్వరలో రాష్ట్రప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టం తీసుకురానుంది.అర్బన్‌, సహకార బ్యాంకులపై ఏర్పాటు చేసిన నిపుణుల కమీటి ఇచ్చిన సూచనల ప్రకారం ఈ చట్టానికి రూపకల్పన చేస్తున్నట్లు రాష్ట్ర సహకార మంత్రి చిక్కాల రామచంద్రరావు తెలిపారు. ఆయన శుక్రవారం హైదరాబాద్‌ లోఅర్బన్‌ బ్యాంకుల అధికారులు, నిపుణుల కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

అర్బన్‌ బ్యాంకులను ఆయా యాజమాన్యాలు తమ సొంత ఆస్తుల మాదిరిగా ట్రీట్‌ చేస్తుండడం వల్లే బ్యాంకుల్లో అక్రమాలుచోటుచేసుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. డిపాజిట్‌ దార్ల ప్రయోజనాలు కాపాడేలా బ్యాంకులు నడుచుకునేట్లు, ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా ఈ చట్టం ద్వారా బ్యాంకులపై ఒత్తిడితీసుకొస్తామన్నారు. బ్యాంకులన్నీ జావాబుదారీతనం పాటించేలా చూస్తామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X