వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ దురుద్దేశంతోనే అరెస్ట్‌ : కరుణ

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: తన కుమారుడుఎం.కె.అళగిరి అరెస్ట్‌ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోపించారు.సీనియర్‌ డీఎంకే నేత కురుత్తినన్‌ హత్యకు పాల్పడిన నిజమైన దోషులను పట్టుకుంటే నేను నిజంగా సంతోషిస్తాను, కానీ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఎంతమాత్రం సహించబోమని కరుణానిధి బుధవారం మధ్యాహ్నంవిలేకరులతో అన్నారు. తన కుమారులు - స్టాలిన్‌, అళగిరి- ఇద్దరూ తిరిగి కలిసిపోవడం సహించలేని కొన్నిస్వార్థ శక్తులు కురుత్తినన్‌ హత్యకు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.

తన కుమారుడి అళగిరి అరెస్ట్‌ ను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ హత్యకేసునుసీబీఐకి అప్పగించాలని డీఎంకే డిమాండ్‌ చేస్తుందా అని ప్రశ్నించగా, ఇంకా తామేమీ నిర్ణయించలేదని ఆయన తెలిపారు. అళగిరిఅరెస్ట్‌ ను కోర్టులోనే తేల్చుకుంటామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X