• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అభివృద్ధి వేగానికి బాబు సూచన

By Staff
|

హైదరాబాద్‌: స్వర్ణాంధ్ర సాధనకు అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో గురువారం జరిగిన అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

వనరుల సేకరణ, నిధుల కేటాయింపు, గరిష్ట స్థాయిలో నిధుల వినియోగాలను బట్టి ప్రభుత్వం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సాధించాల్సిన అభివృద్ధిపై సూచికలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొన్నదని ఆయన చెప్పారు. నీటి పారుదల, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా ఆ రంగాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X