• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేవేందర్‌ గౌడ్‌కు పార్టీ బాధ్యతలు?

By Staff
|

తిరుపతి: హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరుసీనియర్‌ మంత్రులను మంత్రి వర్గం నుంచి తొలగించి బిజెపి తరహాలో పార్టీ పగ్గాలుఅప్పగించాలనే ఆలోచన చంద్రబాబు చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

సీనియర్లకు పార్టీ బాధ్యతలుఅప్పగించాలనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన ఆచరణ రూపం దాలుస్తున్నట్లు పార్టీ నాయకులు గుసగుసలాడుతున్నారు. ఇందులో భాగంగానే దేవేందర్‌ గౌడ్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిఅప్పగించే సూచనలున్నట్లు చెబుతున్నారు. ఇందుకు గాను ఆయనను మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు మరోసారి ఎన్నిక కావడం లాంఛనమే. ఈ ఎన్నిక బుధవారం జరుగుతుంది.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేవేందర్‌ చెవిన వేసినట్లు అనుకుంటున్నారు. ఈ నిర్ణయం సోమవారం నాడే జరిగిపోయిందని చెబుతున్నారు. ఈ పరిణామం పట్ల దేవేందర్‌ సంతోషంగా లేరని కూడాఅంటున్నారు. అయితే ఈ విషయాన్ని ధృవీకరించేందుకు పార్టీ నేతలు వెనుకాడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X