• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కర్ణాటకతో చర్చలకు సిద్ధమే: ఎమ్మెస్‌

By Staff
|

నిజామాబాద్‌: నీటి పారుదల ప్రాజెక్టులవిషయంలో కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడడానికి తాము సిద్ధమేనని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ రావు ప్రకటించారు. ఆయన నిజామాబాద్‌లో మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

కర్ణాటక ప్రభుత్వం వివిధ నదులపై ప్రాజెక్టులను నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు నీరు రాకుండా అడ్డుకుంటోందనేవివాదం చెలరేగిన విషయం తెలిసిందే. నీటి పారుదల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయనవిమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. నెల రోజుల పాటు వృద్ధులకు ఉచిత భోజనాన్నిఅందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.అప్పుల వల్ల రాష్ట్రానికి ఏ విధమైన లాభం లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X