• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాక్‌తో చర్చలపై ప్రధాని ఆశాభావం

By Staff
|

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పరచగలదన్న ఆశాభావాన్ని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పి, ఉగ్రవాదుల శిక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం ద్వారా చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పరచగలదని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నట్లు, మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. జర్మనీ, రష్యా, ఫ్రాన్స్‌ పర్యటనలకు బయలుదేరే ముందు ఆయన మంగళవారం కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ను కలుస్తున్నారా అని అడిగితే ఈ సమయంలో అటువంటి సమావేశం ఏదీ ఉన్నట్లు తెలియదని ఆయన జవాబిచ్చారు. ప్రధాని తన వారం రోజుల విదేశీ పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షుడువ్లదిమీర్‌ పుతిన్‌తో, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు జాక్విస్‌ చిరాక్‌తో, చైనా అధ్యక్షుడు హు జింటావోతో, జర్మనీ చాన్సలర్‌గెర్హార్డ్‌ షోరెడర్‌తో ప్రధాని వాజ్‌పేయికి ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయని ప్రధాని కార్యాలయం అధికారవర్గాలు చెప్పాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X