• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రభుత్వానికి చట్టం వర్తించదా?: వైయస్‌

By Staff
|

రాజమండ్రి: చట్టం ప్రభుత్వానికి వర్తించదా అని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆయన పాదయాత్ర మంగళవారం 49వ రోజు తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి ప్రారంభమై శంఖవరంమీదుగా సాగింది.

కరువు పనుల్లో బాలకార్మికులను అనుమతిస్తున్నారని, బాల కార్మికుల చేత పని చేయించడం నేరమని ఆయన అన్నారు. కరువు పనుల కింద చేపట్టిన శంఖవరం మండలం పొత్తులు చెరువు తవ్వకం కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. బాలకార్మికుల చేత చెరువు తవ్వకం పనులు చేయిస్తుండడం ఆయన దృష్టికి వచ్చింది. కరువు పనుల వల్ల అధికార తెలుగుదేశం పార్టీవారే లబ్ధి పొందుతున్నారని ఆయనవిమర్శించారు. కరువు పనుల్లో కాంట్రాక్టర్లు లేరని ప్రభుత్వంఅంటోందని, అయితే కాంట్రాక్టర్లే కరువు పనులు చేయిస్తున్నారనేది తన పాదయాత్రలో బయట పడిందని ఆయన చెప్పారు. తెలుగుదేశం నాయకులు కాంట్రాక్లర్లుగా వచ్చి కరువు పనులు చేయిస్తున్నారని, తద్వారాపేద కూలీలను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. కూలీలకు తగినంత బియ్యం ఇవ్వడం లేదని ఆయన అన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరా హామీని ఎన్నికల కోసం ఇవ్వడం లేదని, ఇక్కడిరైతాంగ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయానికి ఉచితంగా కరెంట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకున్నదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X