గుడ్ గవర్నెన్స్ లో మేమే బెస్ట్: బాబు
తిరుపతి: దేశవ్యాప్తంగా పరిశీలిస్తే రాష్ట్రంలోని తమ పాలనేఅందరికీ ఆదర్శప్రాయంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గుడ్ గవర్నెన్స్ కు తాము ప్రతీకగా నిలిచామన్నారు. మహానాడు రెండో రోజైన బుధవారం ఆయన పార్టీసీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రచించిన గుడ్ గవర్నెన్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన ఈ గవర్నెన్స్ సాధిస్తోన్న ప్రగతిని ఆయనవివరించారు. పలువురు మంత్రులు, ఇతర నాయకులు కూడా ఈ సందర్భంగా చంద్రబాబును ప్రశంసలతో కురిపించారు. మరింత సుపరిపాలననుఅందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆహుతులకువివరించారు. నెట్ కు మించిన గొప్ప సాధనం మరోటి లేదని, ప్రభుత్వ కలాపాలు మరింత వేగంగా జరిగాలంటేఅంతా ఆన్ లైన్ ప్రక్రియనే వాడుకోవాలని ఆయన సూచించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!