• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగుదేశంతో పొత్తు: వెంకయ్యనాయుడు

By Staff
|

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. గురువారం ఇక్కడ ప్రారంభమైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుల, కార్యదర్శుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత మిత్రపక్షాలన్నింటితో పొత్తు ఉంటుందని ఆయన చెప్పారు.

ఈ ఏడాది ఆఖరులో జరిగే ఐదు రాష్ట్రాలఅసెంబ్లీ ఎన్నికలకు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఈ సమావేశం జరిగింది. తమ, తమ మిత్రపక్షాల ప్రభుత్వాల పనితీరుపై ఓట్లు వేయాలని ప్రజలను కోరనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పాలన దుష్ప్రభావాలను తుడిచేయాలంటే తమకు మరో ఐదేళ్ల కాలం అధికారం కావాలని ఆయన అన్నారు. తాము స్ఫూర్తిదాయకమైన పరిపాలనఅందించామని ఆయన చెప్పారు. అభివృద్ధి, ఉగ్రవాదాలు వచ్చే ఎన్నికల్లో తమ ప్రచారాస్త్రాలవుతాయని ఆయన అన్నారు.

అయోధ్యలో రామాలయం పక్కనే మసీదును నిర్మించుకోవచ్చునని తాను అనలేదని, పరిక్రమ వెలుపల ఎప్పుడైనా నిర్మించుకోవచ్చునని తాను అన్నానని ఆయన చెప్పారు. తన మాటలు పత్రికల్లో సరిగా రాలేదని ఆయన స్పష్టం చేశారు.

వాజ్‌పేయి నేతృత్వంలోని వచ్చే ఎన్నికలను ఎదుర్కుంటామని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ చెప్పారు. వచ్చే ఎన్నికలను ఒక యుద్ధంగా పరిగణించి పని చేయాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 300కుపైగా సీట్లు గెలుస్తుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X