• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎండలకు 566 మంది మృత్యువాత

By Staff
|

హైదరాబాద్‌: రాష్ట్రంలో వడదెబ్బకు, వేడి గాలులకు దాదాపు 566 మంది మృత్యువాత పడ్డారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రం వేడిగాలులతో, ఎండలతో అట్టుడుకిపోతోంది.

గురువారంనాడు 72 మంది మృత్యువాత పడ్డట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో అత్యధికులు మృత్యువాత పడ్డారు. నల్లగొండ జిల్లాలో 119 మంది మరణించినట్లు సమాచారం. తూర్పు గోదావరి జిల్లాలో 87 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 63 మంది, ప్రకాశం జిల్లాలో 59 మంది, కరీంనగర్‌ జిల్లాలో 62 మంది, గుంటూరు జిల్లాలో 46 మంది, నెల్లూరు జిల్లాలో 30 మంది మరణించారు.

రాష్ట్రానికి ఎప్పటికప్పుడు రుతపవనాలు వస్తాయని అనుకుంటున్నప్పటికీ ఎండతీవ్రత, వేడిగాలులు తగ్గడం లేదు. మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు విలవిలలాడిపోతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X