• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇక పార్టీపై బాబు ప్రత్యేక దృష్టి!

By Staff
|

హైదరాబాద్‌: మూడు రోజుల పాటు సాగిన మహానాడు ముగియడంతో ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టిసారించనున్నారు. శుక్రవారం ఉదయమే ఆయన పార్టీ సీనియర్‌ మేధావివర్గంతో కాసేపు చర్చలు జరిపారు. తొలుత మహానాడులో కొత్త కార్యవర్గాన్ని ప్రకటించాలని అనుకున్నప్పటికీ పలు కారణాల వల్ల దాన్ని వాయిదావేశారు.

సోమవారం నాడు కొత్త కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఎన్టీఆర్‌ భవన్‌ వర్గాలు చెపుతున్నాయి. శుక్ర, శనివారాల్లో ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. ఆదివారం ఆయన స్వగృహంలోనే పార్టీ పునర్వవస్థీకరణ గురించి చివరి సారిగా చర్చించి ప్రకటిస్తారని తెలుస్తోంద. ఈ సారి భారీగా మార్పులుంటాయని ప్రచారం జరుగుతోన్న, ప్రాంతీయ సమానత్వంపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ కార్యవర్గంలో ఆ మేరకు మార్పులు జరుగుతాయని అంటున్నారు. అయితే, హోంమంత్రి టి.దేవందర్‌ గౌడ్‌ ను తిరిగి పార్టీలోకి తీసుకునే అంశంపై బాబు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X