వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా, భారత్‌ స్నేహం మరింత ధృడం

By Staff
|
Google Oneindia TeluguNews

సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌: రష్యా-భారత్‌ ల మధ్య ఏళ్ళుగా కొనసాగుతోన్నస్నేహబంధం మరింత బలపడనుంది. ఇరు దేశాల మధ్య సహకారాన్ని,స్నేహాన్ని మరింత విస్తరించుకోవాలని రష్యా అధ్యక్షుడువ్లాదిమర్‌ పుతిన్‌ అన్నారు. ఆర్థిక సంబంధాలే కాకుండా సైనిక-సాంకేతిక, అంతరిక్షపరిశోధన రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య బంధం గట్టిపడుతోందని పుతిన్‌ అన్నారు.సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ త్రిశత ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో పాలుపంచుకునేందుకు వచ్చిన భారత్‌ ప్రధాని వాజ్‌పేయితో పుతిన్‌ మే 30 వ రాత్రి సమావేశమయ్యారు.

రష్యా భారత్‌ కు మంచి మిత్రదేశమని వాజ్‌పేయి అభివర్ణించగా, తమ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన వాజ్‌పేయికి పుతిన్‌ కృతజ్ఞతలు తెలియచేశారు.ఆర్థిక రంగాల్లోనే కాకుండా మేం ఇతర అత్యంత సున్నితమైన రంగాల్లోనూ కలిసి పనిచేస్తున్నాం. ఈ సంబంధాల్లో చక్కటిపురోగతి కన్పిస్తోందని పుతిన్‌ అన్నారు.

ఇంతకుముందే ఇండో-రష్యా నావికా దళాలు చరిత్రలో తొలిసారిగా సంయుక్తం ప్రయోగాలు చేపట్టాయి. అవివిజయవంతం కూడా అయ్యాయని పుతిన్‌ సంతోషం వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X