వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొగతాగడాన్ని గ్లామరైజ్‌ చెయ్యద్దు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: సినిమాల్లో హీరో, హీరోయిన్లుస్టైల్‌ గా సిగరెట్‌ తాగుతూ, ఆనందాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా సన్నివేశాలు చిత్రీకరించవద్దని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా పరిశ్రమలకువిన్నవించింది. ముఖ్యంగా హాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రరంగాలు సిగరెట్‌ తాగడాన్ని గ్లామరైజ్‌ చేసి చూపిస్తున్నాయని ఆరోపించింది. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భాన్ని పురస్కరించుకొని ముంబై, హాలీవుడ్‌ నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు.

యువ హృదయాలపై సినిమా తారల జీవనశైలీ అధికంగా ప్రభావం చూపుతుంది. సినిమాల్లో తారలు సిగరెట్‌ తాగడాన్ని చూపితే..వారు అది సబబేమోనని భ్రమపడుతారని ఆరోగ్యసంస్థకు డెరెక్‌ యాక్‌ అన్నారు. ఈ రెండు సినిమా పరిశ్రమల ప్రతినిధులతో తాము త్వరలో చర్చలు జరుపనున్నామన్నారు.

భారతీయ చిత్రాల్లో ఎనభై శాతం చిత్రాలు పొగతాగే దృశ్యాలు పెడుతున్నట్లు ఒక నివేదికలోపేర్కొంది. క్యాన్సర్‌ బారిన పడే వారికి భాద్యులు సినిమావారేనని అనలేమని, కానీ దాన్ని గ్లామరైజ్‌ చేసే పాపాన్ని మూటగట్టుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థపేర్కొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X