• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

త్వరలో హైదరాబాద్‌ లోనూ బీచ్‌!

By Staff
|

హైదరాబాద్‌: హైదరాబాద్‌ లో సుందరమైనసాగర్‌ ఉంది కానీ బీచ్‌ లేదని నిరుత్సాహపడేవారికో శుభవార్త. త్వరలో హైదరబాద్‌ లోనూ బీచ్‌ ఏర్పడనుంది. అదేంటి..బీచ్‌అంటే ఏమైనా చెట్టు నాటడానికి అనుకోకండా..హైదరాబాద్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ (హుడా) తలుచుకుంటే కృత్రిమ బీచ్‌ లు ఓ లెక్క. హుస్సేన్‌ సాగర్‌ తీరాన 400మీటర్ల పొడువునా కృత్రిమ బీచ్‌ ఏర్పాటు చేయనున్నట్లు హుడా వైస్‌ ఛైర్‌పర్సన్‌ లక్ష్మిపార్థసారథీ సోమవారం తెలిపారు.

సంజీవయ్య పార్క్‌ వద్ద ఖాళీగాఅంటే నెస్ట్‌ రెస్టారెంట్‌ నుంచి మొదలుకొని ప్రస్తుతం దోబీఘాట్‌ గా కొనసాగుతోన్న 300 నుంచి400 మీటర్ల ప్రాంతమంతా ఇసుకతో నింపనున్నట్లు ఆమెవివరించారు. ఈ ప్రాంతమంతా సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

పిల్లల కోసం రాక్‌ గార్డెన్‌ వంటివి కూడా ఏర్పాటు చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కృత్రిమ బీచ్‌ వల్ల కుటుంబ సభ్యులంతా తీరికగా సాయంత్రం వేళ వచ్చిసాగరజలాలను వీక్షించొచ్చని ఆమె అన్నారు. అలాగే భారీ ఎత్తున ఇక్కడ పార్కింగ్‌ స్థలాన్ని కూడా నిర్మించనున్నామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X