వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమలలో ప్రారంభమైన సంప్రదాయ కోడ్
తిరుపతి: భక్తుల్లో సంస్కృతి,సంప్రదాయల పట్ల మక్కువ పెంచడంతోపాటు, భక్తుల్లో పవిత్ర భావన పెంపొందించేందుకు తిరుమల తిరుపతిదేవస్థానం డ్రెస్ కోడ్ ను ప్రవేశపెట్టింది. ఈసంప్రదాయ డ్రెస్ కోడ్ మంగళవారం నుంచిఅమల్లోకి వచ్చింది. ఆర్జిత సేవలకుహాజరయ్యే భక్తులు కూడా సంప్రదాయ దుస్తులుధరించి ఆలయంలోకి అడుగుపెట్టాలి.
పురుషులు పంచె, ధోవతిగానీ, ఉత్తరీయం ధరించి రావాలి. స్త్రీలు చీరగానీ, చుడీదార్ మాత్రమే ధరించి రావాలని తిరుమల తిరుపతిదేవస్థానం పాలక మండలి నిర్ణయించింది. ఈతాజా నిర్ణయానికి భక్తుల నుంచి తొలిరోజుమంచి స్పందనే వచ్చింది. దీని వల్ల భద్రతా ఆందోళనలు కూడాతగ్గుతాయని పాలక మండలి చెపుతోంది. ఇప్పటివరకు కొన్ని రకాలసేవలకు మాత్రమే అమల్లో ఉన్న ఈ కోడ్, అర్చన,తోమాయం లకూ వర్తింపచేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!