• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తిరుమలలో ప్రమాదం- ముగ్గురు మృతి

By Staff
|

తిరుపతి: తిరుమలలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎపిఆర్‌టిసి) బస్సు లోయలో పడిపోయి ముగ్గురు ప్రయాణికులు మరణించారు; 40 మంది గాయపడ్డారు. ఇందులో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాదం బుధవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో జరిగింది.

తిరుమల కొండల నుంచి బి కొత్తకోటకు వెళ్తున్న ఆర్టీసి బస్సు మలుపు తిరిగుతుండగా అదుపు తప్పి లోయలో పడిపోయింది. సిబ్బందితో పాటు బస్సులో 43 మంది ఉన్నారు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని వీరంతా తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులుపెద్ద యెత్తున సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోఅశ్విని ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుల్లో ఒక పురుషుడు అక్కడికక్కడే మరణించగా ఒక మహిళ, ఒక పాప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. మరణించినవారిని కరీంనగర్‌ జిల్లా జగిత్యాలకు చెందిన 13 ఏళ్ల గంగాభవానిగా, ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలకు చెందిన పద్మగా గుర్తించారు. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది.

డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం సంభవించిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బ్రేక్‌ఫెయిల్‌ కావడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని డ్రైవర్‌ చెబుతున్నట్లు అధికారులుఅంటున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. క్షతగ్రాతుల హాహాకారాలతో, బంధువుల రోదనలతోఅశ్వినీ ఆస్పత్రి అట్టుడికపోతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X