• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పరగోడు: విడుదలైన దేశం నేతలు

By Staff
|

అనంతపురం: కర్ణాటక పోలీసులు శుక్రవారంఅరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశంనాయకులను శనివారం సాయంత్రం విడుదల చేశారు.కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్నపరగోడు ప్రాజెక్టును వెంటనే ఆపేయాలని డిమాండ్‌ చేస్తూ కర్ణాటకలోని బాగేపల్లి వైసు దూసుకెళ్లిన తెలుగుదేశం నాయకులను శుక్రవారం కర్ణాటక పోలీసులుఅరెస్టు చేశారు.

తమ నేతల అరెస్టుతో అనంతపురం జల్లాలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. శనివారం అనంతపురం జిల్లా బంద్‌ పాటించారు. తెలుగుదేశం కార్యకర్తలు ప్రదర్శనలు నిర్విహిస్తూ దుకాణాలను, ఇతర సంస్థలను మూయించారు. చెదురమొదురు సంఘటనలుమినహా బంద్‌ ప్రశాంతంగానే జరుగుతోంది. తమ నేతలను కర్ణాకట పోలీసులు అక్రమంగాఅరెస్టు చేశారని వారు ఆరోపించారు.

జైలులో ఉన్న తమ నేతలను పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని ప్రచారం జరగడంతో తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండ శాసనసభ్యుడు పరిటాల రవీంద్ర నియోజకవర్గంలో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉంది. ఎన్‌.ఎస్‌. గేటు వద్ద బెంగుళూర్‌ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రదర్శనకారులు ఆపేశారు. ఇతర ప్రాంతాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఎం. కృష్ణ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

బాగేపల్లి వైపు దూసుకెళ్లిన 47 మందిని కర్ణాటక పోలీసులు శుక్రవారంఅరెస్టు చేశారు. అరెస్టయినవారిలో జిల్లా పార్లమెంటు సభ్యులు కాలవ శ్రీనివాసులు, బి.కె. పార్థసారథి, శాసనసభ్యులు పరిటాల రవీంద్ర, పల్లె రఘునాథరెడ్డి, జయరాం,సి.సి. వెంకటరాముడు, సాయినాథ్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలను చెదరగొట్టేందుకు తొలుత కర్ణాటక పోలీసులు లాఠీచార్జి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X