వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటి వరాలపై మార్గదర్శకాలు: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కోటి వరాల అమలుకు వారంలోగా మార్గదర్శక సూత్రాలను రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు.

తెలుగుదేశం మహానాడులో ఇచ్చిన హామీల మేరకు బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి, ఉపాధికి కోటీ వరాల పథకాల లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శక సూత్రాలను రూపొందించి జిల్లా కలెక్టర్లకు పంపుతామని ఆయన చెప్పారు. నెలవారీ లక్ష్యాలతో నిధులు విడుదల చేసి అమలును సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ పథకాల అమలుకు అవసరమైతే నిబంధనలను సరళీకృతం చేస్తామని ఆయన చెప్పారు. వెలుగు, ఆదరణ, గృహనిర్మాణం వంటి పథకాల అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాలవారీగా ప్రభుత్వ భూములవివరాలను నెలలోగా సేకరించాలని ఆయన అధికారులను ఆదేశించనున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X