వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుజల్లులతో పులకరించిన హైదరాబాద్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరమంతా మంగళవారం చిరుజల్లులు పడడంతో నగరవాసుల్లో ఆనందం వెల్లివెరిసింది. రెండు నెలలుగా ఉక్కపోతతోసతమతమయిన నగరవాసులు మంగళవారం ఉదయం నుంచే వాతావారణం పూర్తిగా చల్లబడి ఆహ్లాదంగా మారడంతో నిజమైన సమ్మర్‌ హాలీడేస్‌ ను అనుభవించారు.

విహార ప్రదేశాలైన ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్‌ ప్రాంతాలకువిచ్చేశారు. పిల్లలు కేరింతలు కొడుతూ చల్లటి వాతావరణాన్ని తనివీతీరా ఎంజాయ్‌ చేశారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఓ మోస్తారు కన్నా అధికంగానే వర్షం పడింది. మరో రెండు రోజుల నుంచి పూర్తిస్థాయిలో వర్షాలు పడనున్నాయి.

ఈ సారి వర్షపాతం అధికంగా ఉండి, వచ్చే ఏడాదికి నీటి కొరత ఉండదని నగరవాసులు ప్రార్థిస్తున్నారు. అయితే, వాతావరణపరిశోధన శాఖ ఎప్పటిలాగే వర్షం పడ్డాక..ఇంత వర్షపాతం పడిందని లెక్కలు చెప్పడంమినహా ఈ ఏడాది ఖచ్చితంగా వర్షపాతం ఎలా ఉంటుందో చెప్పలేకపోతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X