• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పీసీసీ రూట్‌ వేరు, వీఎచ్‌ ది సెపరేట్‌!

By Staff
|

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రాష్ట్రపీసీసీ ఒక దారిలో పయనిస్తుంటే....రాష్ట్రానికి చెందిని ఏఐసిసి సభ్యులు మరో దారిలో నడుస్తున్నారు.సీఎల్పీ నేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర పూర్తయ్యేంతవరకు బ్లాక్‌ స్థాయి సమావేశాలను వాయిదావేయాలనిపీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారయణరావు నిర్వహించగా, ఏఐసిసి కార్యదర్శివి.హన్మంతరావు దీన్ని బేఖాతరు చేస్తూ..తనేస్వయంగా ఈ సమావేశాలను ప్రారంభించారు.

హైదరాబాద్‌ లోని హిమాయత్‌ నగర్‌ బ్లాక్‌ సమావేశాలను ఆయన మంగళవారం నిర్వహించారు. దేశమంతా జూలైలోపు ఈ సమావేశాలు పూర్తి కావాలని ఏఐసిసి షెడ్యూల్‌ విధించిందని, తను అదే షెడ్యూల్‌ ను పాటించననివీఎచ్‌ విలేకరులకు చెప్పారు.

ఇది పీసీసీ నిర్ణయానికి వ్యతిరేకంగా లేదా అని ప్రశ్నించగా..నేను ఏఐసిసి కార్యదర్శిని నేను ఏఐసిసి చెప్పినట్లే నడుచుకుంటున్నానని ఆయన సమాధానమిచ్చారు. ఈ సమావేశాలకు కాంగ్రెస్‌సీనియర్‌ నేత శివశంకర్‌, మాజీ సీఎల్పీ నేత పి.జనార్ధన్‌ రెడ్డి హాజరుకావడంవిశేషం. శివశంకర్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ..కాంగ్రెస్‌ లో ఆత్మశోధనకరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X